![]() |
![]() |

సల్మాన్ ఖాన్(Salman Khan)ముంబై(Mumbai)లో అత్యంత ఖరీదైన ప్రాంతంగా పిలవబడే 'బాంద్రా'(Bandra)లోని గెలాక్సీ అపార్ట్ మెంట్(Galaxy Apartments)లో ఎక్కువ భాగం నివాసం ఉంటాడు. ఎన్నో ఖరీదైన హౌసెస్ ఉన్నప్పటికీ బాల్యంలోని జ్ఞాపకాలు, మరియు కుటుంబ వాతావరణం కారణంగా గెలాక్సీ లో ఉండటానికి ఇష్టపడతాడు.
ఈ నెల 20 న ఉదయం పది గంటల సమయంలో ఒక వ్యక్తి సల్మాన్ ఇంటి ముందు అనుమానాస్పదంగా తిరిగాడు. దీంతో పోలీసులు అతన్ని అక్కడ నుంచి వెళ్లిపొమ్మని చెప్పారు. ఆ వెంటనే కోపంతో తన సెల్ ఫోన్ ని విసిరి కొట్టి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. కానీ అదే రోజు సాయంత్రం మళ్ళీ గెలాక్సీ దగ్గరకొచ్చి, అదే అపార్ట్ మెంట్ లో ఉంటున్న ఒక వ్యకి కారు వెనక నుంచి గెలాక్సీ లోపలకి ప్రవేశించాడు. అదే సమయంలో లోపల విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది అతన్ని పట్టుకొని పోలీసులకి సమాచారం ఇచ్చింది.
అనంతరం పోలీసుల విచారణలో సదరు వ్యక్తి మాట్లాడుతు నా పేరు జితేందర్ కుమార్ సింగ్.చత్తిస్ గడ్ రాష్ట్రం నుంచి సల్మాన్ కలవడానికి వచ్చాను. గెలాక్సీ లోపలకి అనుమతించకపోవడంతో దొంగచాటుగా వెళ్లానని చెప్పాడు. ప్రస్తుతానికి పోలీసులు జితేందర్ ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసారు. సల్మాన్ ని చంపుతామని గత కొంత కాలం నుంచి గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు జితేంద్ర కుమార్ సల్మాన్ ఇంట్లోకి ప్రవేశించడం సంచలనంగా మారింది.
![]() |
![]() |